బావామరదల ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహనకృష్ణ, శిరీష, సౌజన్య ప్రధాన తారాగణంగా మాణిక్య మూవీస్ పతాకంపై గంగారపు లక్ష్మణమూర్తి దర్శకత్వంలో రాజు రూపొందించిన చిత్రం ‘బావామరదలు’. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ‘ఓ మంచి కథను నిర్మాతే తయారు చేసుకొన్నాడు. దర్శకుడి గురించి ఆలోచిస్తూ, నేను రూపొందించిన ‘అతడు ఆమె ఓ స్కూటర్’ తీసిన విధానం నచ్చడంతో నన్ను పిలిచి అవకాశమిచ్చారు. ఓ వైవిధ్యమైన కథ, కథనంతో రూపొందుతున్న చిత్రమిది. బావామరదళ్ల సరసాలు, సరదాలతో ఆహ్లాదకరంగా సాగిపోతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఇటీవల విడుదల చేసిన ఆడియో ప్రేక్షకుల ఆదరణ పొందిందని, పాటలతోపాటుగా ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చే చిత్రమని హీరో మోహనకృష్ణ ప్రామిస్ చేస్తున్నాడు. అఖిల్ సర్‌తక్, రవివర్మ, దిలీప్, వైజాగ్ శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రానికి ఎడిటింగ్ నందమూరి హరి, కెమెరా సాహిద్, కథ, మాటలు మాణిక్యం మూవీస్, సంగీతం బండారు దానయ్య కవి.