జక్కన్న.. అదృష్టవంతుడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జక్కన్న అదృష్టవంతుడు. బాహుబలి మీద మాస్టరీ చేసి.. ఆ అనుభవంతో మరో ‘మహా’ సినిమా చేద్దామనుకున్నాడు. అయితే, మహాభారతాన్ని ముట్టుకోకముందే ‘అసలు ప్రణాళిక’ బయటకు పొక్కింది. లేదంటే..? పాతతరంలోని ఓ సినిమా అనుభవజ్ఞుడు యధాలాపంగా అన్న మాటలివి. సింపుల్ కామెంట్‌లోని సీరియస్‌నెస్ అర్థం చేసుకుంటే -జక్కన్న అదృష్టవంతుడేనని అర్థమవుతుంది.
మహాభారతాన్ని తీసే అవకాశం మిస్సయ్యాడన్న బాధ తెలుగువాడు అనుభవిస్తుంటే.. జక్కన్న -అదృష్టవంతుడు అంటారేంటి? అన్న ప్రశ్న చాలామంది నుంచే వస్తోంది. కానీ, సినిమా అనే వ్యాపార కోణంలో చూస్తే కచ్చితంగా జక్కన్న అదృష్టవంతుడేనన్నది సీనియర్ అంతరార్థం. ఒక్కసారి -ఐదేళ్ల క్రితం ఫ్లాష్‌బ్యాక్‌ని ఓపెన్ చేద్దాం.
బాహుబలి. నిజానికి దశాబ్దంనాటి జక్కన్న కల. ఐదేళ్ల క్రితం తపస్సు మొదలైంది. జాతీయ అంతర్జాతీయ నిపుణులు, ఎంపిక చేసుకున్న తారాగణాన్ని కూర్చోబెట్టాడు. ప్రణాళిక వివరించాడు. ‘బాహుబలి’ కోసం తపస్సు చేద్దామన్నాడు. బృందానికి నాయకుడై ముందుకు నడిపించాడు. అనుకున్నట్టుగానే -ప్రపంచ ప్రఖ్యాత తెలుగు సినిమా అన్నదానికి బాహుబలిని బ్రాండ్ అంబాసిడర్ చేసేశాడు. భావుకత కలిగిన ఓ దర్శకుడు చిన్న చందమామ కథను గొప్పగా ఊహించుకుంటే -దాని విశ్వరూపం ఎంత బలంగా ఉంటుందో స్క్రీన్‌కు ఎక్కించాడు. తాను కన్న ‘బాలమిత్ర’ కథను దృశ్యకావ్యంగా మలిచేందుకు అహరహం కృషి చేశాడు. వందల కోట్ల పెట్టుబడి పెట్టించాడు. తన కల ఎంత గొప్పగా ఉందో చూడండంటూ సిల్వర్ స్క్రీన్ మీద విజువల్ ఫీస్ట్ చేశాడు. తెలుగోడి గొప్పతనం ఇదీ -అని చాటిచెప్పేందుకు జక్కన్న ఎంత కష్టపడ్డాడన్న పేరు పార్ట్-1తోనే వచ్చేసింది. ఇన్ని కష్టాలు, ఇన్ని గొప్పలకు ఫినిషింగ్‌గా ‘కన్‌క్లూజన్’ పార్ట్‌ను ఏప్రిల్ 28న చూపించబోతున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ -జక్కన్న బాహుబలిని కలగన్నాడే కానీ, ‘డ్రీం ప్రాజెక్టు’గా ఇప్పటి వరకూ చెప్పుకోలేదు. ఈ విషయంలో అతని నుంచి లీకులేమైనా ఉంటే గింటే -అవి మహాభారతం గురించే. అంటే -అభిమానులకు అర్థమైనంత వరకూ రాజవౌళి డ్రీం ప్రాజెక్టు ‘మహాభారతం’. ఒక ప్రాజెక్టును గొప్పగా ఊహించి.. గొప్పగా చిత్రీకరించి.. గొప్పగా మార్కెట్ చేసి.. గొప్పగా హిట్ చేయడమెలాగో జక్కన్నకు బాగా తెలుసు. నిజానికి ఈ కోణంలో బాహుబలి మీద చేసిన థీసెస్ అనుభవంతో ‘మహాభారతాన్ని’ మార్కెట్ చేద్దామన్నది అతని ఫ్యూచర్ ప్లాన్. ‘ఎవరూ ఊహించని విధంగా మహాభారతాన్ని తెరకెక్కించగలను’ అని ప్రకటించడం వెనుక అంతరార్థం కూడా అదే. దీంతో ‘కన్‌క్లూజన్’ విడుదల తరువాత రాజవౌళి తరువాతి ప్రాజెక్టు అదేనన్న అంచనాలూ వినిపించాయి. ఈలోగానే ‘మహాభారతం’ ప్రాజెక్టు ప్రకటన వెలువడింది. రాజవౌళి నుంచి కాదు, ప్రముఖ యాడ్ ఫిలిమ్ రూపకర్త విఎ శ్రీకుమార్ మీనన్ నుంచి. ఆయన దర్శకత్వ సారథ్యంలో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా ‘మహాభారతం’ తెరకెక్కుతున్నట్టు ప్రకటన వచ్చేసింది. జ్ఞానపీఠ్ అవార్డీ ఎంటి వాసుదేవ నాయర్ నవలే కథకు ఆధారమన్నది తేలిపోయింది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘గ్లోబల్’ ప్రాజెక్టును తీర్చిదిద్దే ప్రయత్నాలన్నీ పూర్తయ్యాయి. టైటిల్ కూడా రిజిస్టరైందన్నది తాజా కథనాలు.
ఈ పరిస్థితుల్లో రాజవౌళి రహస్యంగా ప్రాజెక్టుపై ముందుకెళ్లివుంటే.. ‘మహా’ ప్రణాళికమీద సమయాన్ని, సొమ్మును భారీగా వెచ్చించివుంటే..? ఇవేం జరగలేదు కనుక -ఆమేరకు నష్టం నుంచి జక్కన్న తప్పించుకున్నట్టే. ఇదే అతని అదృష్టం అన్నది
గతతరం నాటి అనుభవజ్ఞుడి అంచనా. ఓ తెలుగోడు ‘మహాభారతం’ తీసే అవకాశం ఎలాగూ మిస్సయ్యింది. పైగా, మహాభారతంలోని ఘట్టాలను మనవాళ్లు ఎప్పుడో టచ్ చేసి అద్భుతమైన సినిమాలే తీసేశారు. సో.. ఓ తెలుగు దర్శకుడు మరోసారి అంతటి గొప్ప ప్రయత్నం చేయాలంటే ‘్భవిష్యత్’లోకి తొంగిచూడాలి. అక్కడ దొరికే కథను ముందే ఊహించి ఓ అద్భుతం సృష్టించాలి. ఈ ఆలోచనవైపు పయనించడానికి రాజవౌళికి అవకాశం దొరకడం కూడా -అదృష్టమనే చెప్పాలి.