అర్చనను తట్టుకోలేరు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి తట్టుకోలేరు.. అంటోంది తెలుగు పిల్ల అర్చన. కొంతకాలంగా తెలుగు స్క్రీన్‌కు దూరంగావున్న అర్చన -త్వరలోనే హారర్, థ్రిల్లర్‌తో రాబోతోందట. తెలుగు సినిమాల్లో తెలుగు భామలు ఫోకస్ అయిన దాఖలాలు తక్కువ. అప్పట్లో తెలుగు హీరోయిన్లు ఉండేవారు.. కానీ 90 దశకం తరువాత అంతా పరాయి భాష హీరోయిన్లు టాలీవుడ్‌ని షేక్ చేస్తున్నారు. ఒకరో ఇద్దరో తెలుగు భామలు టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక తెలుగులో హీరోయిన్‌గా రెండు మూడు సినిమాలు చేసిన అర్చనకు, ఆ తరువాత హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సైడ్ పాత్రలు చేసింది. ఈమధ్యే ఓ విభేదంతో సంచలనం రేపిన అర్చన, తెలుగు పరిశ్రమను వదలి ముంబైలో ఉంటుంది. టాలీవుడ్‌కి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోందట. అయితే ఈసారి మంచి కమర్షియల్ హారర్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అశ్విన్ అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా ఉంటుందని లీకులిస్తోంది. మరి ఈసారైన అర్చన తెలుగులో బ్రేక్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి.