ఫిబ్రవరి నుంచే కొత్తచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ దాదాపు పూర్తికాగా, ఈ సినిమా తరువాత మహేష్ నటించే కొత్తచిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. ప్రముఖ తమిళ సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోనే సినిమాను మొదలుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మహేష్ కూడా ఓకె అన్నాడని తెలిసింది. న్యాయవ్యవస్థపై పోరాటం అనే అంశంతో తెరకెక్కే ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఈ చిత్రానికి హరీశ్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. మురగదాస్-మహేష్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.