నిన్నుకోరి.. ప్రియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని కథానాయకుడిగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్.ఎల్.పి పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. రూపొందించిన చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- అమెరికాలో భారీ షెడ్యూల్ చేశామని, ఈనెల 17నుండి వైజాగ్‌లో షూటింగ్ జరుపుతున్నామని, ఇది 29వరకూ జరుగుతుందని తెలిపారు. దీంతో ప్యాచ్‌వర్క్ మినహా సినిమా షూటింగ్ పూర్తవుతుందని, జూన్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. నివేదా థామస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారని ఆయన అన్నారు. మురళీశర్మ, తనికెళ్ల భరణి, పృధ్వీ, రాజశ్రీనాయర్, నీతూ, గోపాల్‌రాజ్, కేదార్‌శంకర్, నీరజ, ప్రియాంకా నాయుడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు:కోన వెంకట్, సంగీతం:గోపీసుందర్, కెమెరా:కార్తీక్ ఘట్టమనేని, పాటలు:రామజోగయ్య శాస్ర్తీ, శ్రీజో, నిర్మాత:దానయ్య డి.వి.వి., రచన, దర్శకత్వం:శివ నిర్వాణ.