లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాదానికి కారకుడూ ఆయనే. ఇప్పుడు పరిష్కరానికి కారకుడూ ఆయనే. కావేరీ నదీ జలాలకు సంబంధించి కన్నడ ప్రజలకు కాకపుట్టేలా కామెంట్ చేసిన సత్యరాజ్, బాహుబలి చిత్రాన్ని కర్నాటకలో బతికించేందుకు కూల్ కామెంట్లు చేసి వివాదానికి తెరదించారు. సత్యరాజ్ నటించిన చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదని కన్నడ సంఘాలు భీష్మించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపడమే కాదు, బాహుబలి టీం గుండెల్లో గుబులు పుట్టించింది. చిత్రాన్ని విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేయడంతో దర్శక నిర్మాతలు కంగారుపడ్డారు. ఈ విషయంపై దర్శకుడు రాజవౌళి కన్నడ ప్రజలను ఎంత వేడుకున్నా వాళ్లు దిగిరాలేదు. ఎట్టకేలకు నటుడు సత్యరాజ్ బహుబలి చిత్రాన్ని అడ్డుకోవద్దని, ఎవరైనా తన మాటలకు ఇబ్బంది పడితే క్షమించండి అంటూ ఎప్పుడో చేసిన కామెంట్లకు ఇప్పుడు మెట్టు దిగడంతో వివాదం సద్దుమణిగింది. చిత్ర విడుదలను అడ్డుకోబోమని పలు కన్నడ సంఘాలు తీర్మానించాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేస్తే తప్ప పెట్టిన పెట్టుబడికి రాబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాహుబలి సినిమా విషయంలో సత్యరాజ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పడంలో ఆంతర్యం అదే గోచరిస్తోంది. బాహుబలి మొదటి భాగం కన్నడంలో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో భాగానికి కూడా అక్కడ భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా కర్ణాటక ఏరియా హక్కులు కూడా భారీ స్థాయిలో అమ్ముడయ్యాయి. అంతా బాగానే వుంది అనుకునే సమయంలో కావేరీ నదీ జలాల వివాదం రేగడం, దాంతో కన్నడ ప్రజలపై సత్యరాజ్ విమర్శలు చేయడం దుమారం రేపింది. మొత్తానికి బాహుబలి-2 చిత్రం ఈనెల 28న భారీ స్థాయిలో విడదలవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9వేల థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
కమల్ ప్రశంస
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ సత్యరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన ఓ మానవతావాదిగా అభివర్ణించారు. సమస్య తలెత్తినపుడు సహేతుకంగా వ్యవహరించటం అనుభవజ్ఞులకే సాధ్యం. బాహుబలి చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని వివాదాన్ని పరిష్కరించేందుకు సత్యరాజ్ చేసిన ప్రయత్నం అభినందనీయమే.. అంటూ కమల్ ట్వీట్ చేయడం విశేషం.