2న సరసుడు ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా శింభు సినీ ఆర్ట్స్, జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకాలపై పాండిరాజ్ దర్శకత్వంలో టి.రాజేందర్ రూపొందించిన చిత్రం ‘సరసుడు’. శింబు సోదరుడు టి.ఆర్.కురళ అరసన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను మే 2న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజేందర్ మాట్లాడుతూ- ఐటి బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నంగా సాగే ప్రేమకథ ఇదని, రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలోని పాటలను కెనడాలో కంపోజ్ చేశామని, ఐదు పాటలతో రూపొందించిన ఈ ఆడియోను మే 2న విడుదల చేసి అదే నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. గతంలో తాము రూపొందించిన మన్మథ, వల్లభ చిత్రాల స్థాయిలో ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు. సత్యం రాజేష్, సూరి, సంతానం, జయప్రకాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు, నిర్మాత:టి.రాజేందర్, కెమెరా:బాలసుబ్రహ్మణ్యం, ఎడిటింగ్:ప్రవీణ్ ప్రదీప్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండిరాజ్.