‘సాహో’... ప్రభాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు ఐదేళ్లు బాహుబలి సినిమాకు కేటాయించిన ప్రభాస్ హీరో ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ పెంచిన ప్రాజెక్టులో ‘కన్‌క్లూజన్’ పార్ట్ బాహుబలి-2 28న విడుదలవుతోంది. దీని తరువాత ఆయన నటిస్తున్న చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని యువీ క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తోంది. దీనికి ముందునుంచీ ఊహిస్తున్నట్టే ‘సాహో’ టైటిల్‌నే ఖరారు చేశారు. సినిమాకు సంబంధించి నిర్మాతలు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఐదేళ్ల తరువాత అభిమానులు ఎదురుచూస్తున్న ప్రభాస్ తదుపరి చిత్రం సుజిత్ దర్శకత్వంలో మొదలుకానుంది. చిత్రానికి సాహో టైటిల్ ఖరారు చేశాం. హై టెక్నికల్ యాక్షన్ డ్రామాగా చిత్రం ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషిన్లను తీసుకురానున్నాం. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకులు శంకర్, ఎహసాన్, లాయిల త్రయం సంగీతం అందిస్తుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా రూపొందే ఈ సినిమా ఫస్ట లుక్ టీజర్‌ను బాహుబలి-2 చిత్రంతోపాటు ప్రదర్శించనున్నామని అన్నారు.