ఆ నలుగురివల్లే విజయం.. ఎన్టీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఇంత విజయం సాధించడానికి నాలుగు మూలస్తంభాలు వున్నాయని, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సుకుమార్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌లే ఆ నలుగురు అని, వారు లేకపోతే ఈ చిత్రం ఇంత గొప్పగా రూపొందేది కాదని, అంతే విజయాన్ని సాధించేది కాదని నటుడు ఎన్టీఆర్ తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై రకుల్‌ప్రీత్‌సింగ్, ఎన్టీఆర్ జంటగా రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పలు విశేషాలను తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, సుకుమార్, తాను ఏదో ఒక మంచి సినిమా జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలనుకున్నామని, తన 25వ చిత్రం ఇంత మంచి అనుభూతి మిగిల్చినందుకు సంతోషంగా వుందని తెలిపారు. సినిమా హిట్ అయిందా లేదా, ఎంత కలెక్ట్ చేసిందని కాకుండా, వెనక్కితిరిగి చూసుకుంటే ఓ మంచి సినిమా తీశామన్న గర్వం వుండాలని, ఆ కోవకు ఈ చిత్రం చెందుతుందని ఆయన అన్నారు. దేవిశ్రీ తన సంగీతంతో, విజయ్ తన విజువల్స్‌తో ప్రాణం పోశారని, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ లాంటి వాళ్లు ఇచ్చిన సపోర్టు ముఖ్యంగా ఈ చిత్రానికి ప్లస్ అయిందని ఆయన అన్నారు. తాను ఆనందంతో అలిసిపోయి మాటలాడలేని పరిస్థితిలో వున్నానని, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన సాంకేతిక నిపుణులకు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబున్నానని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఈ సినిమా 15 సంవత్సరాల క్రితం వచ్చి వుంటే వృద్ధాశ్రమాలు వచ్చి వుండేవి కావని ఓ కామెంట్‌ను ఈ సినిమా విడుదలయ్యాక తాను విన్నానని, లెక్కలు చెప్పే మాస్టర్ సుకుమార్ కంటే ప్రేక్షకులే పెద్ద ప్రొఫెసర్లు అని, మంచి మార్కులు వేసి హిట్ చేశారని నిర్మాత ప్రసాద్ తెలిపారు. తక్కువ సినిమాలతో సంతృప్తి కలుగుతుంది అనంటే, తాను ఈ చిత్రంలో నటించినందుకు పూర్తి సంతృప్తిగా వున్నానని నటి రకుల్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ సినిమాలో హీరో, విలన్ల రొమాన్స్ హైలెట్‌గా నిలిచాయని, ఈ సినిమా మొదలుపెట్టినపుడే దర్శకుడు రొమాన్స్ అదిరిపోవాలని చెప్పారని, అదేవిధంగా అదిరిపోయిందని నటుడు జగపతిబాబు తెలిపారు. కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.