నిండుదనం వచ్చింది -చిరంజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకులు కె.విశ్వనాథ్‌కు ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం.. అవార్డుకే నిండుదనం వచ్చిందని కథానాయకుడు చిరంజీవి అభినందించారు. మంగళవారం విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ విశ్వనాథ్‌తో తనకు సినిమాపరంగానేగాక, కుటుంబపరంగానూ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్‌కు అవార్డు రావడం చిత్ర పరిశ్రమకే గర్వకారణమన్నారు. తాను మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతున్నానని, ఈ అవార్డు ఎప్పుడు వచ్చిందనే విషయంపై అనవసరమైన చర్చ వద్దని, అవార్డు ఆయన్ను ఎప్పుడో వరించాల్సి వుందన్నారు. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరుకుంటానని చిరంజీవి వాఖ్యానించారు.