అలాంటి గ్లామర్ పాత్రలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను చేసే పాత్ర ముందు నాకు నచ్చాలి. నటించేటప్పుడు సంతోషం కలగాలి. హీరోయిన్ అంటే అందంగా కనిపించాలి. కానీ ఇపుడు వస్తున్న గ్లామర్ పాత్రల్లో నటించడానికి నేను సిద్ధంగా లేను’ అంటోంది అర్తనా బిను. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్‌తరుణ్, అర్తన బిను జంటగా రూపొందించిన చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీ్ధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అర్తన బిను చిత్ర విశేషాలను తెలిపారు.
నా గురించి
మాది కేరళ. నేను బి.ఎ జర్నలిజం చేస్తున్నాను. నా స్నేహితురాలి ప్రొఫైల్‌లో నన్ను చూసి ఓ కాస్టింగ్ మేనేజర్ సినిమాలో నటించమని అడిగారు. ఈ సినిమాకోసం వచ్చి ఆడిషన్ చేశాను. అలా ఈ చిత్రంలో ఎంపికయ్యాను.
నా పాత్ర
ఈ చిత్రంలో నా పాత్ర పేరు సీత. మోడరన్‌గా కనిపించే సీత పాత్ర నాకు బాగా నచ్చింది. హీరోయిన్ కొన్ని సీన్లకు, పాటలకు పరిమితవ్వకుండా సినిమా అంతా తిరుగుతుంటుంది. అందుకే నటించడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రం ఒప్పుకున్నప్పటికి ఒక్క తెలుగు చిత్రం కూడా నేను చూడలేదు. ఒప్పుకున్న తరువాత మలయాళంలో డబ్ అయిన తెలుగు సినిమాలు చూశాను. షూటింగ్ మొదట్లో భాష తెలియకపోవడంవల్ల ఇబ్బంది పడ్డాను.
హీరో గురించి
రాజ్‌తరుణ్ మంచి నటుడు. హావభావాల ప్రదర్శన, డైలాగ్ చెప్పడంలో నాకు చాలా హెల్ప్ చేశాడు. నాకిప్పుడు తను మంచి ఫ్రెండ్. అతని సహాయం మర్చిపోలేనిది.
ఇంకా చదువుతా
నేను ఇప్పుడు బి.ఏ మధ్యలో ఆపేసి సినిమాల మీద ధ్యాసపెట్టే ఉద్దేశ్యం లేదు. ఎక్కువ సినిమాలు చేయాలన్న ఆలోచనా లేదు. మెల్లగా నాకు నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటాను. చదువుకున్న తరువాత మంచి హీరోయిన్‌గా వుండడానికి ప్రయత్నిస్తాను.
దర్శకుడి గురించి
దర్శకుడు శ్రీనివాస్ హార్డ్‌వర్కర్. నటీనటులనుండి ఎలాంటి నటన రాబట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. స్క్రీన్‌ప్లే చాలా బాగా వివరించి చెప్పారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ సినిమా. గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ. సీత గురించి రాముడు ఏం చేశాడు అన్నదే ప్రధాన కథనం. కథ కొత్తది అని చెప్పనుగాను కొత్తగా చిత్రీకరించిన విధానం బాగుంది. ప్రస్తుతం మలయాళంలో ఓ చిత్రంలో నటించాను. అది ఫిబ్రవరిలో విడుదల కానుంది. మరే చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు.

-యు