గ్యాప్ మంచిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైదీ నెం 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మళ్లీ కొన్నాళ్లు గ్యాప్ తీసుకునే అవకాశం వుందని టాలీవుడ్ సమాచారం. రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు దశాబ్దంపాటు గ్యాప్ తీసుకున్న ఆయన, ఇటీవలే ఖైదీ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి పాఠకులకు తెలిసిందే. అయితే వెంటనే కొత్త చిత్రం ప్రారంభించకుండా బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నించారు. కానీ ఈ కార్యక్రమం ఆశించినంత రేటింగ్స్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ సీజన్ ముగింపు దశకు వచ్చింది. వచ్చేనెలలోనే ఈ కార్యక్రమం ముగియనుందని తెలుస్తోంది. ఆ తరువాత చిరంజీవి కొత్త సినిమాలో నటిస్తాడా లేక మరో టీవీ కార్యక్రమంలో కనిపిస్తాడా అని చర్చ జరుగుతోంది. అయితే ఈసారి మరో చిత్రానికి గ్యాప్ తీసుకోవటానికే చిరంజీవి ఇష్టపడుతున్నారట. త్వరలోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో నటించనున్న ఆయన, అవి పూర్తయ్యాక తరువాతి విషయం ఆలోచిద్దాం అన్నారట. దాంతో గ్యాప్ తీసుకోవడం తప్పనిసరైవుతోంది. అయినా గ్యాప్ ఆరోగ్యానికి మంచిదే కదా!