భయపెడుతూనే నవ్విస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గ్లామర్, నటన అనేవి నటికి రెండూ అవసరమే. అయితే మంచిపేరు రావాలంటే కమర్షియల్ చిత్రాల్లో నటించక తప్పదు. సినిమా పరిశ్రమలో సెటిల్ అయ్యాక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలి. అయితే ఇక్కడ నిర్ణయాలు మా చేతుల్లో వుండవు’ అంటోంది నటి పూనమ్ బజ్వా.
పదేళ్ల క్రితమే తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై సుందరి ‘పరుగు’ తరువాత మలయాళ తమిళ చిత్రాలకే పరిమితమైంది. మళ్లీ ఇన్నాళ్లకు ‘కళావతి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. ఈనెల 29న విడుదల కానున్న ఈ చిత్రం గూర్చి పూనమ్‌బజ్వా పలు ఆసక్తికర విశేషాలను తెలిపారు.
నర్స్ పాత్రలో
‘కళావతి’లో నేను ఓ మలయాళీ నర్స్‌గా నటించాను. రాజభవనంలోకి నేను ప్రవేశించిన తరువాత పరిస్థితులు మారిపోతాయి. ఇంట్లోవారంతా నాపై అనుమానం వ్యక్తం చేస్తారు. అనూహ్య సంఘటనలకు కారణం ఎవరు? అసలు కళావతి ఎవరు అనేదే సస్పెన్స్. సుందర్.సి గతంలో చేసిన ఓ చిత్రంలో ఓ పాటలో నటించాను. ఇపుడీ చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు.
ఎడిటింగ్ తరువాత భయమేసింది
ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యేది. ఐదున్నర గంటకు ప్యాకప్ చెప్పేవాళ్లు. ఈ సినిమాలో నటించేటపుడు అందరూ ఇష్టపడే నటించారు. నేను హారర్ చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి. షూటింగ్‌లో పెద్దగా భయం అనిపించలేదు. ఎడిటింగ్‌లో చూశాక మాత్రం చాలా భయమనిపించింది. భయపెడుతూ నవ్వించే చిత్రం ఇది.
త్రిష ట్వీట్
హన్సికతో కలిసి ‘రోమియో జూలియట్’ చిత్రంలో నటించాను. త్రిషతో కలిసి నటించిన చిత్రం అనివార్య కారణాలవల్ల విడుదల కాలేదు. కానీ ఇద్దరికీ మంచి స్నేహం వుండడంతో ఈ సినిమా షూటింగ్ జరిగనన్ని రోజులు సరదాగా గడిచిపోయాయి. ఓ రోజు షూటింగ్‌లో నేను కునుకు తీస్తుంటే ఆ ఫొటోను త్రిష ట్వీట్ చేసింది. ఈ చిత్రం మంచి జ్ఞాపకాలను మిగిల్చింది.
నేను లక్కీ
ప్రతి ఏడాది పరిశ్రమకు 40 మంది కొత్త కథానాయికలు వస్తున్నారు. 30 మందికి రెండో అవకాశం రావడంలేదు. ఓ నలుగురు ముగ్గురు మాత్రమే ఈ పదేళ్లలో మంచి స్థానాన్ని చేరుకోగలిగారు. ఈ లెక్కలతో బేరీజు వేస్తే నేను చాలా లక్కీ.
నే హార్డ్‌వర్కర్ కాదు
కాజల్, తమన్నా, త్రిషాలతో నన్ను పోల్చవద్దు. వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకోవాలి. వాళ్లు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను వారి అంత హార్డ్‌వర్కర్‌ని కాదు. మొదటి సినిమా చేసిన సమయంలో నాకు పరిశ్రమపై పెద్ద అవగాహన కూడా లేదు. అదృష్టం నా వెంట వుండబట్టే మరో రెండేళ్లు అవకాశాలు వస్తాయనుకున్నా. కానీ పదేళ్లు పరిశ్రమలో వున్నా. అది చాలు నాకు.
ఏ ఒక్కపాత్రకో పరిమితం కాను
‘పరుగు’ చిత్రం తరువాత అక్క పాత్రలో ఎందుకు నటించావని చాలామంది అడిగారు. ఓ రకంగా అవమానించారు కూడా. మంచి సినిమా అనుకొని ఆ చిత్రంలో నటించా. ఆ తరువాతనే అటువంటి అవకాశాలు చాలా లభించాయి. దాంతో కన్నడ మలయాళ తమిళ చిత్రాల్లో నటించాను. ప్రత్యేక పాటలు, మంచి పాత్రల్లో నటించడం తప్పుకాదు అని నా అభిప్రాయం. కానీ వరుసగా అవే వస్తున్నాయి. మన చేతుల్లో ఏమీ వుండదు. కథానాయికల జీవితం ఇంతే. అయితే, ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం నాకు నచ్చని అంశం. మళ్లీ హీరోయిన్‌గా నటిస్తాను.

-శ్రీ