మరో రీమేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు వెంకటేష్‌కి రీమేక్ సినిమాలపై ఆసక్తి వున్న విషయం తెలిసిందే. మంచి సినిమా ఎక్కడ ఉన్నా దాన్ని తెలుగులోకి రీమేక్ చేయడంలో ముందుంటాడు. ఇప్పటికే తమిళంలో సూపర్‌హిట్ అయిన ఎన్నో చిత్రాల్ని రీమేక్ చేసిన వెంకటేష్ ఈసారి సినిమా విడుదల కాకముందే ఆ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. బాలీవుడ్‌లో మాధవన్ హీరోగా నటిస్తున్న ‘సాల ఖద్దూస్’ చిత్రాన్ని రీమేక్ చేస్తాడట. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతోపాటు ఈ చిత్ర ప్రిమియర్ షోను వెంకటేష్ చూశాడు. సినిమా అద్భుతంగా వుండడంతో దీన్ని రీమేక్ చేస్తానని ఆ దర్శకుడికి కాల్షీట్లు కూడా ఇచ్చేశాడట. రిటైర్ అయిన బాక్సర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 29న హిందీలో విడుదల అవుతోంది. త్వరలోనే దీన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మారుతి దర్శకత్వంలో ‘బంగారుబాబు’ చిత్రంలో నటిస్తున్నాడు.