మా సినిమాకూ ఓ లెక్కుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా జగదీష్ తలశిల దర్శకత్వంలో మయూఖా క్రియేషన్స్ పతాకంపై సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు జగదీష్ తలశిల చెప్పిన విశేషాలు.
‘చాలా సంవత్సరాలుగా బ్యాంకులలో కొన్ని వేల కోట్ల డబ్బు అనాధగా పడి వుంది. ఇండియన్ ఎకానమీలో కూడా ఈ ఇష్యూ గురించి వివరాలు ఉన్నాయి. అందరూ క్లైమ్ చేయకుండా వదిలేసిన డబ్బుకు సంబంధించిన కథే ఇది. దానికి ఎంటర్‌టైన్‌మెంట్, థ్రిల్లింగ్ అంశాలను జోడించి ప్రేక్షకులకు ఆకట్టుకునేలా రూపొందించాం. ఇందులో నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠిలు బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తారు. కథ గురించి చెప్పాలంటే బ్యాంకులలో వడ్డీ తీసుకోకుండా వదిలేసిన డబ్బే కొన్ని వేల కోట్లలో వుంది. అలాంటి డబ్బును బయటికి తీయడానికి ఓ టీమ్ ఏం చేసింది? దాన్ని ఎలా ఛేదించారు అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇక నా గురించి చెప్పాలంటే మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాను. 2003లో ‘అమృతం’ సీరియల్‌కు గుణ్ణం గంగరాజు దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. ఆ తరువాత చంద్రశేఖర్ యేలేటి, రాజవౌళి దగ్గర అసోసియేట్‌గా పనిచేశా. నేను తీసే సినిమా అనగానే రాజవౌళి ప్రభావం నామీద వుంటుందని అందరూ అంటున్నారు. కానీ ఆ ప్రభావం లేకుండా సినిమా తీయడానికి ప్రయత్నించా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కథ మొత్తం విన్న తరువాతే ఆయన సినిమాకు సంగీతం చేస్తా అన్నారు. అలాగే, ఇందులో నటుడు జె.పితో ఓ పాట పాడించాం. ఇక ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తుంది. ఉమాదేవి, అంకాలమ్మ పాత్రల్లో బాగా నటించింది. ఈ రెండు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. అలాగే ఇందులో ఎలాంటి లిరిక్ లేకుండా ఓ ఇరిటేషన్ సాంగ్ కూడా వుంటుంది. ఈ సినిమా తరువాత ఓ భారీ స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని తీయాలని ఉంది’ అంటూ ముగించారు.