హరేరామ హరేకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలీప్ ప్రకాష్, రెజీనా జంటగా సాయి అరుణాచలేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై అర్జున్ సాయి దర్శకత్వంలో నవీన్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘హరేరామ హరేకృష్ణ’. చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ శామీర్‌పేట దేవాలయంలో మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత నవీన్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఈరోజు నుంచి సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తాం. ప్రస్తుతం హీరో హీరోయిన్లు, ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఆమనిలపై షూటింగ్ జరుపుతున్నాం. మరో పది రోజులపాటు హైదరాబాద్‌లోనే తొలి షెడ్యూల్‌లో భాగంగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. వైవిధ్యమైన కథ కథనాలతో సాగే చిత్రంలో హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అమ్మాయిగా తాను నటిస్తున్నానని, అంతరించిపోతున్న సంప్రదాయ కళలను కాపాడే మనస్తత్వం వున్న అమ్మాయిగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు రెజీనా తెలిపారు. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ సినిమా సాగుతుందని దర్శకుడు అర్జున్‌సాయి వివరించారు. కార్యక్రమంలో దిలీప్ ప్రకాష్ తదితరులు సినిమా విశేషాలు వెల్లడించారు.