సుకుమార్ కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు కథ నచ్చితేనే సినిమాకు ఓకె చెబుతా. అంతేగాని, చిన్న పెద్ద సినిమా అన్న ఆలోచనలు నాకు ఉండవు అంటున్నాడు కెమెరామెన్ రత్నవేలు. రోబోవంటి సంచలన చిత్రానికి పనిచేసిన రత్నవేలు, తాజాగా రాజ్‌తరుణ్, హెబాపటేల్ జంటగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో వస్తున్న ‘కుమారి 21 ఎఫ్’ సినిమాకు పనిచేశాడు. ఈ సందర్భంగా కెమెరామెన్ రత్నవేలుతో ఇంటర్వ్యూ...
సుక్కుకోసమే..
శంకర్‌తో పనిచేసిన ‘రోబో’ తరువాత చాలా అవకాశాలు వచ్చాయి. కానీ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో తమిళంలో మూడు, నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘హరిదాస్’ సినిమాకు పనిచేశాను. నాకు కథ నచ్చితేనే సినిమా చేయడానికి అంగీకరిస్తా. అంతేగాని చిన్న, పెద్ద సినిమా అన్న తేడా చూడను. ప్రత్యేకంగా కుమారి 21 ఎఫ్ చేయడానికి మాత్రం కారణం సుకుమారే. నిజానికి ఈ సినిమా నా బాధ్యతగా భావించా. ఇది చిన్న సినిమా అయినా ఇంటలిజెంట్ స్క్రిప్ట్.
స్క్రిప్ట్‌ను అర్థం చేసుకుంటా
నేను దర్శకుల కెమెరామెన్‌ని. వారు చెప్పే స్క్రిప్ట్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కెమెరామెన్‌పై ఉంటుంది. అందుకే కథను కనీసం నాలుగైదుసార్లు చదువుతా. కెమెరామెన్ అనేవాడికి సినిమా ఎడిటింగ్‌లో, మ్యూజిక్‌లో, డైరెక్షన్‌లో నాలెడ్జి ఉండాలి. సుకుమార్‌తో నాకు మంచి రిలేషన్ ఉంది. తను చెప్పిన కథను ప్రెజెంట్ చేయగలననే నమ్మకంతో చేశా. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తనను ఫోకస్ చేయడానికి లైట్ ఎక్కువగా ఉపయోగించాం. నాకు ఎక్కువగా సాంగ్స్‌కంటే సీన్స్ షూట్ చేయడమంటేనే ఇష్టం.
అప్‌డేటవుతూ ఉండాలి
కేవలం రెండు లైట్స్ మాత్రమే ఉపయోగించి క్వాలిటీతో సినిమా చేయగలను. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ కంటే ఆర్ట్, సైన్స్ ముఖ్యం. అలానే కెమెరామెన్ ఆలోచనా విధానం ఇంకా ముఖ్యం. ఇక మీకు పోటీ ఎవరని అడిగితే నాకు నేనే పోటీ అని చెప్తా. నేను చేసిన సినిమా చూసి అందరూ వచ్చి పొగుడుతున్నా నేను మాత్రం తృప్తిపడను. ఇంకా బాగా చేసి ఉండాల్సిందనే అనుకుంటాను. తమిళ సినిమాటోగ్రాఫర్‌లే ఎక్కువగా ఉంటున్నారని అనుకుంటారు. కాని క్రియేటివిటీ ఎవరిలోవుంటే వాళ్ళే మంచి టెక్నీషియన్స్ అవుతారు.
డైరెక్టర్‌గా..
ఖచ్చితంగా దర్శకునిగా ఓ సినిమా చేస్తా. స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. యాక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాలన్నది ఆలోచన. ప్రస్తుతం నేను ‘బ్రహ్మోత్సవం’ చేస్తున్నాను. ‘రోబో-2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేశారు. కానీ నేను ఆ సినిమా చేయడం లేదు.

-శ్రీ