చంచలపతీ.. తగదిది!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన పైత్యానికి ఒడిగట్టాడు సీనియర్ నటుడు చలపతిరావు. కొమ్మపై కూర్చుని చెట్టునే హేళన చేసిన అతని వైఖరి పరిశ్రమలో పెద్ద దుమారానే్న రేపుతోంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం నుంచీ తెరపై పోషించిన విలనీ పాత్రల వెకిలితనాన్ని పబ్లిక్ వేదికపై ప్రదర్శించి ఛీత్కారాలు అందుకుంటున్నాడు. తాత వయసులో పదిమందికీ మంచి చెప్పాల్సిన సీనియర్ నటుడు, మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడం పరిశ్రమనే కుదిపేస్తోంది. తెలుగు సినిమా బూతుమయమైందంటూ వినిపిస్తున్న అపవాదును పెద్దరికంతో ఖండించాల్సిన సీనియర్ నటుడు, బాధ్యతను విస్మరించి నిర్లజ్జగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిశ్రమలోని సీనియర్ల బండారం ఇదేనా? అన్న అనుమానాలు రేకెత్తించేదిలా ఉంది. రెండు రోజుల క్రితం అన్నపూర్ణా స్టూడియోస్‌లో నిర్వహించిన ‘వేడుక చూద్దాం రారండి’ ఆడియో ఫంక్షన్‌లో చలపతిరావు చేసిన వెకిలి వ్యాఖ్యలకు మహిళలు భగ్గుమంటున్నారు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా’? అంటూ యాంకర్ చిలిపిగా అడిగిన ప్రశ్నకు వయసుకు తగిన హూందా సమాధానం ఇవ్వాల్సింది పోయి, ‘హానికరం కాదుకానీ... పక్కలోకి పనికొస్తారు’ అంటూ బూతు వ్యాఖ్యలు చేయడం సినీ పరిశ్రమ సుగుణానే్న శంకించే పరిస్థితికి తెచ్చింది. అప్పటి ఫంక్షన్‌లో సీనియర్ హీరోలు, వర్థమాన హీరోలు, పలువురు సినీ ప్రముఖులున్నా చలపతిరావు పైత్యాన్ని ఖండించకపోవడం దురదృష్టకరం. అయితే, నటుడి వ్యాఖ్యలపై సామాజిక మీడియా భగ్గుమంది. చలపతిరావు వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో దుమారం లేచింది. మరోపక్క పబ్లిక్ వేదికపై అతని మానసిక ప్రవర్తనను సీరియస్‌గా తీసుకున్న మహిళలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలను కించపర్చేలా మాట్లాడిన నటుడిపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు సామాజిక మహిళా కార్యకర్తలు ఫిర్యాదులో డిమాండ్ చేశారు. వ్యాఖ్యలపై దుమారం లేవడంతో ఓ చానెల్ నిర్వహించిన చర్చకు హాజరై, తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసి భంగపడ్డాడు చలపతిరావు. తానన్న మాటలకు విపరీతార్థాలు తీస్తున్నారని, మహిళలంటే తనకెంతో గౌరవమని మాటమార్చే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు మెట్టుదిగిన చలపతిరావు తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, ఇంకెప్పుడూ ఇలాంటి తెంపరితనాన్ని ప్రదర్శించేది లేదని వివరణ ఇచ్చుకున్నాడు. అసలు సినిమా ఫంక్షన్లకే హాజరుకానంటూ లెంపలేసుకున్నాడు.
క్షమాపణలు చెప్పిన ‘మా’
చలపతిరావు వ్యాఖ్యల కళంకం సినిమా పరిశ్రమనే కుదిపేయడంతో మంగళవారం ‘మా’ తెరపైకి వచ్చింది. చలపతిరావు తరఫున క్షమాపణలు చెప్పింది. మా అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్‌లు మాట్లాడుతూ ‘గతంలో అతనెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. బాధ్యత మరచి నోరు జారడం తప్పేనని ఒప్పుకుంటున్నాడు. అతని వ్యాఖ్యలను మా సైతం ఖండిస్తోంది. ఇలాంటి ఇబ్బందికర వ్యాఖ్యలు మళ్లీ తలెత్తవని పరిశ్రమ తరఫున మాటిస్తున్నాం. ఇలాంటివి పునరావృతమైతే వారిపై చర్యలు తీసుకుంటాం. పరిశ్రమలో మహిళలూ భాగమేనని, అందరం కలిసి పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అంటూ ప్రకటించారు.
తీవ్ర నిరసనలు
చలపతిరావు వ్యాఖ్యలపై పరిశ్రమ నుంచీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నటుడు నాగార్జున, హీరో చైతన్య, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ తదితరులు నటుడి అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఒక సీనియర్ నటుడు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం బాధాకరం. కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఆయన మాటలు నాకు అర్థం కాలేదు. అర్థం తెలిసీ ఇప్పుడు భరించలేకపోతున్నా’ అంటూ రకుల్‌ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలవల్ల పరిశ్రమ గురించి బయటివారు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన వయస్సు, అనుభవానికి తాను చెప్పేంతటి దాన్ని కాకున్నా, ఇలాంటి వ్యాఖ్యలపై స్పందించకపోవడం తప్పనే ఖండిస్తున్నట్టు పేర్కొంది. నటుడు నాగార్జున, హీరో చైతూలు సైతం చలపతిరావు వ్యాఖ్యలను తీవ్రంగా3 ఖండించారు. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అన్న విషయాన్ని మర్చిపోకూడదని ట్వీట్ చేశారు. ‘ఆడియో వేడుకలో ఆయన అలా అనడం తప్పే. అంత పెద్ద సీనియర్ నటుడి గురించి నేను వ్యాఖ్యానించటం తగదు. కానీ అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందే’ అని నాగార్జున వ్యాఖ్యానించాడు.
మహిళలపై సెటైర్లు, ద్వంద్వార్థ డైలాగులు తెరపైనే కాదు, తెరవెనుకా ఎప్పటినుంచో సాగుతున్నదే. రియాల్టీ షోలు, ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్లలో మహిళలపై సెటైర్లువేసి ఎంజాయ్ చేయడం కొందరు సీనియర్ నటులకు అలవాటుగా మారిన వ్యవహారమే. కమెడియన్లుగా చెలామణీ అవుతోన్న కొందరు నటులు యాంకర్లపైన, కథానాయికలపైనే ద్వంద్వార్థపు ప్రయోగాలు చేసి వెకిలితనాన్ని బయటపెట్టుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. ఎదురు తిరిగితే కెరీర్‌కు ఇబ్బంది కలగొచ్చన్న భయంతో ఎవ్వరూ పెదవి విప్పకపోవడం కారణంగానే పరిస్థితి మరీ శ్రుతిమించిందన్న వాదన ఇప్పుడు పరిశ్రమలో మొదలైంది.