అలా మాటిచ్చాను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకులకు కామెడీ అంటే ఎంత ఆసక్తో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్నంతమంది కమెడియన్స్ మరే భాషలోనూ లేరు. వెనె్నల సినిమాతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు సంపాదించి, ఆ సినిమానే ఇంటి పేరు చేసుకున్నాడు వెనె్నల కిశోర్. ప్రస్తుతం ఆయన కీలక పాత్రలో నటించిన ‘అమీ తుమీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా వెనె్నల కిశోర్ చెప్పిన విశేషాలు.
కేశవతో కొత్త ఉత్సాహం..
మొదట డైరెక్టర్ సుధీర్‌వర్మ సినిమా ఆరంభం నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఎమోషన్ అని చెప్పడంతో ఇక ఆ పాత్రలో కామెడీ ఏం ఉంటుంది అనుకున్నా. కానీ షూటింగ్ టైంలో తెలిసింది అందులో ఎంత ఉందో. ఆడియెన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా హ్యాపీగా ఉంది.
నెగెటివ్ షేడ్స్‌తో..
సినిమాలో నాది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. అడివి శేష్, అవసరాల పాత్రలతో సమానంగా నా పాత్ర ఉంటుంది. ఇందులో కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. కానీ అవన్నీ ఫన్నీగానే ఉంటాయి. రెండు రోజుల్లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేదే కథ. పెళ్లికోసం వచ్చిన నేను.. శేష్, శ్రీనివాస్‌ల ప్రేమకథల మధ్యలోకి ఎలా వెళ్తాను, ఆ టైమ్‌లో నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది మంచి కామెడీని జనరేట్ చేస్తుంది. స్టోరీపరంగా చూస్తే నేను విలన్.
హీరోలతో సమానంగా..
కథలో వాళ్లకెంత ప్రాముఖ్యత ఉంటుందో నాకూ అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లకెన్ని సన్నివేశాలుంటాయో నాక్కూడా అనే్న ఉంటాయి. ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి తేడా ఉంటుంది. మోహన్‌కృష్ణతో ‘జెంటిల్‌మాన్’ సినిమా చేశాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నా. సినిమాకి కొన్ని రోజుల ముందే ఆయన పూర్తి స్క్రిప్ట్ మాకిచ్చేశారు. మేము కూడా ముందుగానే ప్రాక్టీస్ చేశాం. దాంతో షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక కెమెరా ముందు పెద్ద కష్టమనిపించలేదు.
కెరీర్ సాఫీగా..
చాలా సాఫీగా సాగుతోంది. కేశవ సినిమా అయితే ఇంకో మూడేళ్లు ఇండస్ట్రీలో నిలబడటానికి అవకాశమిచ్చింది. ఇప్పటికే 150 సినిమాలదాకా చేశాను. ఒక్కోసారి సాధించాల్సిన పేరుకంటే ఎక్కువే వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు థియేటర్‌లలో ఏ హీరోలకైతే విజిల్స్ వేశానో, ఇప్పుడు ఆ హీరోల పక్కనే నటిస్తుండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది.
హీరోగా చేయను..
హీరోగా అసలు చేయను. పైగా నేనసలు హీరోగా సెట్టవ్వను. నమో వెంకటేశాయ షూటింగ్‌లో ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ రాఘవేంద్రరావు పిలిచి కామెడీ బాగా చేస్తున్నావ్, హీరోగా మాత్రం చేయనని మాటివ్వు అన్నారు. నేను కూడా అస్సలు చేయనని ఒట్టేశాను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ విడుదలకు రెడీగా ఉంది. అందులో హీరో ఫ్రెండ్ పాత్ర. దాంతోపాటు మరో రెండు సినిమాలున్నాయి.

-యు