ప్రభాస్‌తో చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్‌గా మారాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు చాలామంది భామలు. ఇప్పటికే ఈ విషయంపై పలువురు భామలు పెదవి విప్పారు కూడా. లేటెస్టుగా బాలీవుడ్ భామ అలియాభట్ మాత్రం ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, అవకాశమిస్తే తనతో నటించేందుకు సిద్ధమేనని అంటోంది. అయితే ఆరడుగులపైన ఉండే ప్రభాస్‌తో అలియాకు జోడీ ఎలా కుదురుతుందో కదా! ఇక అలియాభట్ కావాలనే ప్రభాస్‌పై ఫోకస్ పెట్టినట్టుంది. ఎందుకంటే ఈ భామకు బాలీవుడ్‌తోపాటు సౌత్‌లోనూ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలని ఆశలు ఉన్నాయి. ప్రభాస్ తరువాతి ప్రాజెక్టు సాహో ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. హిందీ వర్షన్‌లో చాన్స్ దక్కించుకోవాని ఆలియా ఆరాటపడుతోందని అంటున్నారు. ఆలియా ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.