మూడు షెడ్యూల్స్‌లో గగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోలాశంకర క్రియేషన్స్ పతాకంపై భూపతిరాజు స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గగన్’ చిత్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. నాగబాల సురేష్‌కుమార్ క్లాప్‌నివ్వగా, రేలంగి నరసింహారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భూపతిరాజు మాట్లాడుతూ అరకు, విశాఖపట్టణం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేశామన్నారు. దసరా, దీపావళి మధ్యలో సినిమా విడుదల చేసే ఆలోచనతో షూటింగ్ సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం మూడు షెడ్యూల్స్‌లో సినిమాను చిత్రీకరించనున్నామని, అందరికీ తెలిసిన రియల్ కథతో వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.