ఇక కమల్ మరుదనాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్‌హసన్ అంటేనే వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు. సినిమా మీద ఆయనకున్న ప్రేమతో అనేకమైన స్క్రిప్ట్ ప్రధానమైన చిత్రాలను రూపొందించడంలో దిట్ట. తానే నిర్మాతగా మారి ఎటువంటి రిస్క్ తీసుకుని మంచి చిత్రం అందించే ప్రయత్నం చేస్తారు. భారీ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఆయన ఖాతాలో పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విశ్వరూపం-2 చిత్రంపై పూర్తి దృష్టిపెట్టి చెప్పారు కమల్. ఈ సినిమా ఎలాగైనా విడుదల చేయాలని ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆయన కలల ప్రాజెక్టు అయిన మరుదనాయకం సినిమా త్వరలో పట్టాలు ఎక్కనున్నదట. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సినిమా ఆగిపోయింది. మధ్యలో ఆగిపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఈ సినిమాను ఎన్నిసార్లు పట్టాలు ఎక్కిద్దామనుకున్నా కానీ ఏదో ఒక అవాంతరం రావడంతో అలా ఆగిపోయింది. బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోవడంతో ఏ నిర్మాతా ముందుకు రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను కేన్స్ ఉత్సవాల్లో పెట్టగా అందరి దృష్టి ఆకర్షించిందని చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన దాదాపు 40 నిమిషాల నిడివి కమల్ దగ్గర ఉంది. ఏదో విధంగా మిగతా సినిమాను పూర్తిచేయాలని పట్టుదలతో కమల్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న పోస్టర్ ఈ చిత్రానిదే. అయితే త్వరలో ఈ సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనేది కాలమే చెప్పాలి.