ఏంచేసినా వెరైటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకొనె ఏం చేసినా సంచలనమే. ఫలానా వేడుకకు అలా వెళ్లిందనీ, ఫలానవాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి ఇలా వెళ్లిందని బాలీవుడ్‌లో నిరంతరం ఆమెపై వార్తలు వస్తూనే వుంటాయి. ఇటీవల ఆమె ఏదిచేసినా అదో కొత్తకోణంలో చూస్తున్నారు బాలీవుడ్ అభిమానులు. ప్రస్తుతం సెక్సీ సైరన్‌గా అభిమానుల చేత ముద్దుగా పిలుచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా దర్శకుడు కరణ్ జోహార్ ఇంటికి వెళ్లింది. అక్కడ మిత్రుడి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లిన దీపికాను చూసి అక్కడివాళ్లంతా అవాక్కైపోయారట. రెడ్ కార్పెట్‌పై నడిచే అలవాటు బాగావున్న దీపిక, కరణ్ పార్టీకి చాలా పొట్టి గౌను వేసుకుని హైస్కూల్ అమ్మాయిలా హైహీల్స్ వేసుకుని బ్లాక్ ఔట్‌ఫిట్ పుల్‌నెక్ టాప్‌లో దర్శనమిచ్చింది. తానేంటో ఒక్కసారి చూడండన్నట్టు అక్కడున్నవారికి సవాల్ విసిరిందట. ఏదేమైనా దీపికా పదుకొనె పొడగరితనానికి, ఆమె వేసుకొచ్చిన పొట్టి డ్రెస్‌కు నీరాజనాలు పట్టారట అభిమానులు. అదీ దీపికా అంటే!