బిటెక్ లవ్‌స్టోరీ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమేష్‌బాబు, శ్రీకాంత్, అంజలి, గెహెనా వశిష్ఠ్ ప్రధాన తారాగణంగా ఇందుజా క్రియేషన్స్ పతాకంపై వనజా, రేణుక సంయుక్తగా రూపొందించిన చిత్రం ‘బిటెక్ లవ్‌స్టోరీ’. పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. సానా యాదిరెడ్డి, నటుడు కృష్ణుడు బిగ్ సీడీని, డి.ఎస్.రావు ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా సానా యాదిరెడ్డి మాట్లాడుతూ, కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు మంచి కథలతో సినిమాలు తీసి విజయాన్ని సాధిస్తున్నారని, మంచి కంటెంట్ వున్న సినిమా తీసిన ఈ చిత్ర దర్శకుడు ఎల్లారెడ్డి మరిన్ని మంచి చిత్రాలు చేయాలని తాను కోరుకుంటున్నట్లు అన్నారు. సిబిఐ ఆఫీసర్‌గా తానీ చిత్రంలో నటించానని, తప్పక విజయవంతం అవుతుందని కృష్ణుడు తెలిపారు. ప్రతి యువకుడికి కనెక్ట్ అయ్యేలా ఓ మంచి ఫీల్ వున్న ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించామని, అందుకే ఈ పేరును పెట్టామని, సమాజంలో యువతకు సందేశంతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ చిత్రంలో వున్నాయని దర్శకుడు ఎల్లారెడ్డి తెలిపారు. హాస్యానికి పెద్దపీట వేసిన ఈ చిత్రంలో ఫొటోగ్రఫి హైలెట్‌గా వుంటుందని, వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, మంచి పాటలు వున్న ఈ చిత్రంలో రమేష్, శ్రీకాంత్ హీరోలుగా కొత్తవారైనా బాగా చేశారని, తప్పక విజయవంతం అవుతుందని నిర్మాత వనజా తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:మేనగ శ్రీను, కెమెరా: జి.ఎల్.బాబు, సంగీతం:చిన్ని చరణ్, నిర్మాతలు:వనజా, రేణుకా, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఎల్లారెడ్డి.