పాటల్లో బుడ్డారెడ్డిపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో జబర్దస్త్ అభీ, సందీప్తి, వరుణ్ ముఖ్యపాత్రల్లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై బూచేపల్లి తిరుపతిరెడ్డి సమర్పణలో రూపొందిన ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సాగర్ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ- ఇదొక విభిన్న తరహా చిత్రం. భారతదేశంలో కొన్ని లక్షల కుటుంబాలు గేదె ఇచ్చే పాలు, వాటి ఇతర ఉత్పత్తుల వ్యాపారంపై ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నారు. అంత ప్రాధాన్యతను సంతరించుకున్న గేదెను ఓ ఎమ్మెల్యే తనయుడు యాక్సిడెంట్‌తో హత్య చేస్తాడు. దాంతో గేదె యజమాని జీవనాధారాన్ని కోల్పోతాడు. తనకు న్యాయం చెయ్యండని రైతులంతా ఏం చేశారు? హత్యకు కారణమైన ఎమ్మెల్యే తనయుడికి ఎలాంటి శిక్ష పడిందన్న ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాత, కొత్తతరం నటీనటులతో ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత మాట్లాడుతూ- రొటీన్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథ, కథనాలతో నరసింహ నంది సినిమాలు చేస్తుంటారు. ఆయన చేస్తున్న మరో భిన్నమైన ప్రయత్నం ఇది. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తామన్నారు.