నేనే రాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్ కాజల్‌కు ఈ మధ్య సరైన సక్సెస్‌లు లేకపోవడంతో కెరీర్ పరంగా కాస్త వెనకబడింది. ప్రస్తుతం తెలుగులో రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటిస్తోంది. ఈ ఒక్క సినిమా తప్ప ఆమెకు అవకాశాలు కలగలేదు. అటు తమిళంలో కూడా అలాగే ఉంది పరిస్థితి. తనను టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రంతో మళ్లీ తనకు సక్సెస్ వస్తుందనే భావంలో ఉంది. ముఖ్యంగా ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉందని ఈ సినిమాతో తనకు మరింత క్రేజ్ పెరుగుతుందని తెగ మురిసిపోతోందట. ముఖ్యంగా కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఆనందంగా ఉందని సన్నిహితులతో చెప్పుకుంటోందని తెలిసింది. ‘నేనేరాజు నేనే మంత్రి’ ట్రయిలర్ విడుదలై మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కాజల్‌కు 50వ సినిమా కావడం విశేషం. ఈ ప్రాజెక్టు తన కెరీర్‌లోనే ప్రత్యేకమని సినిమా తర్వాత మళ్లీ వెనక్కు తిరిగి చూసే అవకాశం ఉండదని చెబుతోంది.