సప్తగిరి ఎల్‌ఎల్‌బి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీలో సూపర్‌హిట్ అయిన జాలీ ఎల్‌ఎల్‌బి చిత్రానికి రీమేక్‌గా సప్తగిరి హీరోగా చరణ్ లక్కాకుల దర్శకత్వంలో సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సప్తగిరి ఎల్‌ఎల్‌బి చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం సప్తగిరి మాట్లాడుతూ- తాను హీరోగా నటించిన తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ను ఊహించినదానికంటే ప్రేక్షకులు పెద్ద హిట్ చేశారని, అందుకే ఎన్నో కథలను అనుకుని చివరికి హిందీలో సూపర్‌హిట్ అయిన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు. కెరీర్‌లో ఇది మంచి సినిమా అవుతుందని సప్తగిరి చెప్పారు. నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ- ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తరువాత తీస్తున్న రెండో చిత్రమిది. హిందీ జాలీ ఎల్‌ఎల్‌బి హక్కులు తీసుకుని తెలుగుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాం. పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన చరణ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని’ అన్నారు. దర్శకుడు చరణ్ మాట్లాడుతూ- ఈ సినిమాతో దర్శకుడిగా మారినందుకు ఆనందంగా ఉందని, ఈ సినిమా మంచి విజయం సాధించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ చిత్రానికి మాటలు:పరుచూరి బ్రదర్స్, సంగీతం:విజయ్ బుల్గానిన్, కెమెరా:సారంగం.ఎస్.ఆర్., ఎడిటింగ్:గౌతంరాజు, నిర్మాత:డా.రవికిరణ్, దర్శకత్వం:చరణ్ లక్కాకుల.