మనసుపెట్టి నటిస్తేనే రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ నటి లేదా నటుడైనా రాణించాలంటే మెదడు చెప్పినట్లు వ్యవహరిస్తే లాభం లేదని, మనసు (హృదయం)తో ఆలోచించాలని, అప్పుడే ప్రతిభ బయటపడుతుందని అంటోంది అలనాటి అందాల తార శ్రీదేవి. భర్త బోనీకపూర్ సారథ్యంలో నిర్మించిన ‘మామ్’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. తమ కుమార్తె జాహ్నవి సినీరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆమె నటిగా గుర్తింపు వచ్చేది మనసుపెట్టి నటించినప్పుడేనని అన్నారు. కష్టపడి పనిచేయడం మరో కీలకమైన విషయమని ఆమె అన్నారు. తన భర్త గొప్పవ్యక్తని, ‘మామ్’ చిత్రం రూపొందడానికి ఆయన వ్యవహార దక్షతే కారణమని శ్రీదేవి అన్నారు. అతడిపై తనకు రోజురోజుకూ ప్రేమ పెరుగుతోందని, నిజానికి అది ప్రేమ అన్న పదంకన్నా ఎక్కువ భావావేశమని అన్నారు.