విలువలు.. వినోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్ హీరోగా కిట్టు ఉన్నాడు జాగ్రత్త ఫేం వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.జె.డి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ డి.గోహిల్ నిర్మిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రూపేష్ మాట్లాడుతూ- ‘సహ నిర్మాతగా రెండు మూడు చిత్రాలకు పనిచేసిన నేను స్వంతంగా ఆర్.జె.డి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా, ప్రసన్నకుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో సందీప్ కిషన్ ఓకె చెప్పాడు. కుటుంబ విలువలున్న వినోదాత్మక చిత్రంగా ఇది తెరకెక్కనుంది. జూలై 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టి హైదరాబాద్‌లోనే ఎక్కువ భాగం చిత్రీకరిస్తాం. హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు:ప్రసన్నకుమార్, సంగీతం:రథన్, కెమెరా:నిజర్ షఫి, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, నిర్మాత:రూపేష్ డి.గోహిల్, దర్శకత్వం:వంశీకృష్ణ.