సాయిధరమ్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథల స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కరుణాకరన్. ఈమధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయనకు చేతిలో సినిమాలు లేవు. దాంతో కాస్త బ్రేక్ తీసుకున్న కరుణాకరన్, తాజాగా మరో ప్రెష్ లవ్‌స్టోరీతో రీఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి ఆయన మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడట. ఇప్పటికే సాయిధరమ్‌తో కథా చర్చలు కూడా జరిగినట్టు తెలిసింది. పవన్‌కళ్యాణ్‌కు తొలిప్రేమతో కెరీర్ టర్నింగ్ ఇచ్చిన కరుణాకరన్, ఆ తరువాత పలు ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఈసారి సాయిధరమ్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరీని చేస్తాడని, కథ నచ్చడంతో సాయిధరమ్ ఓకె చెప్పినట్టు, ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తాడని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం జవాన్ చిత్రంలో నటిస్తున్న సాయిధరమ్, మరోవైపు వినాయక్ దర్శకత్వంలో కూడా నటిస్తాడంటూ తెలిసింది. త్వరలోనే కరుణాకరన్ సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.