లక్కీచాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వాడ జగన్నాథమ్ తరువాత అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ చిత్రం షూటింగ్ మొదలైంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశి దర్శకుడిగా మారుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీ పాత్ర కొత్తగా వుంటుందని తెలిసింది. ఇందులో హీరోయిన్‌గా అను ఇమాన్యుయెల్ నటిస్తుందని సమాచారం. ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అను, ఆ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఏకంగా పవన్‌కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఈమె అందానికి అందం, అభినయం కలబోసిన అనుకు ఇది మరో లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఇప్పటికే పలు క్రేజీ అవకాశాలతో బిజీగా వున్న అను, టాప్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

చిత్రం.. అను ఇమాన్యుయెల్