స్ఫూర్తినిచ్చే హన్సిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, హన్సిక, కేథరిన్ హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.పుల్లారావు, జె.్భగవాన్ నిర్మిస్తున్న చిత్రం ‘గౌతమ్‌నంద’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంతకముందు కేథరిన్ పాత్రను పరిచయం చేశారు. తాజాగా గ్లామర్ భామ హన్సిక పాత్రను పరిచయం చేస్తూ ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ‘గౌతమ్‌నందా చిత్రంలో హన్సిక స్ఫూర్తి అనే పాత్రలో కన్పిస్తుంది. సాంప్రదాయబద్ధ యువతిగా హన్సిక నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హీరో పాత్రకు అనునిత్యం స్ఫూర్తిని కలిగించే యువతిగా ఉంటుంది. చాలా ఎంటర్‌టైనింగ్ వున్న పాత్ర అది. ఇటీవలే విడుదలై టీజర్, పాటకు విశేషమైన స్పందన లభించింది. త్వరలోనే పాటలను విడుదల చేసి చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేస్తాం’ అని అన్నారు.