డ్యూయల్ రోల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరస విజయాలతో జోరుమీదున్నాడు హీరో నాని. డబుల్ హాట్రిక్‌కు సిద్ధమవుతున్న నాని ప్రస్తుతం ‘నిన్ను కోరి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్, పాటలు విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. సినిమా తర్వాత నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అంటే ఎమ్‌సిఏ చిత్రంలో నటించనున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. అలాగే ఈ సినిమాతోపాటు మరో చిత్రానికి నాని ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే గాంధీ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.ఈ చిత్రంలో నాని డ్యూయల్ రోల్ చేస్తాడని తెలిసింది. నాని కెరీర్‌లో తెలుగులో డ్యూయల్ రోల్ చేస్తున్న చిత్రమిది. అయితే ఇందులో ఒకటి నెగిటివ్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం.