పోలీసు జీవితం ఓ కురుక్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్షన్ కింగ్ అర్జున్ 36 ఏళ్ల సినీ కెరీర్‌లో 150వ సినిమా మైలురాయిని చేరాడు. ప్రస్తుతం అరుణ్ బైద్యనాధన్ దర్శకత్వంలో ‘కురుక్షేత్రం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని అరుల్ అందిస్తున్నారు. హీరో అర్జున్ చిత్ర విశేషాలను తెలుపుతూ పోలీసు అధికారుల జీవితాల్లో వున్న మరో కోణాన్ని తీసుకుని స్క్రీన్‌ప్లే హైలెట్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారని, తానిప్పటివరకు 20నుండి 30 సినిమాల వరకు పోలీస్ అధికారిగా నటించానని, ఆ సినిమాల్లో లేని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయని తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు కెమెరా పనితనం సంగీతం హైలెట్‌గా వుంటాయని ఆయన అన్నారు. ఫాషనేట్ స్టుడియోస్‌పై నిర్మాతలు చేసిన సినిమా ఇదని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం వుందని దర్శకుడు అరుణ్ వైద్యనాధన్ అన్నారు. ఇనె్వస్టిగేషన్‌తోపాటు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఎమోషన్‌గా సాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అరుల్ తెలిపారు. కార్యక్రమంలో ఉమేష్, ప్రసన్న తదితరులు విశేషాలు తెలిపారు. వరలక్ష్మి శరత్‌కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శృతి హరిహరన్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: నవీన్, కెమెరా: అరవింద్ కృష్ణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్ వైద్యనాధన్.