కిడ్నాప్ చేశారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ సమర్పణలో శ్రీకర్‌బాబు దర్శకత్వంలో మాధవి అద్దంకి నిర్మించిన చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తికావచ్చిన ఈ చిత్రం గూర్చి నిర్మాత వివరాలు తెలియజేస్తూ- పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికావచ్చాయని, త్వరలో సెన్సార్ కార్యక్రమాల్ని జరపనున్నామని, శ్రీకర్‌బాబు అద్భుతంగా తెరకెక్కించాడని అన్నారు. దర్శకుడు శ్రీకర్‌బాబు మాట్లాడుతూ, ప్రముఖ కార్టూనిస్టు మల్లిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇదని, ఆయన మొదటి చిత్రం కూడా ఇదే కావడం ఆనందంగా ఉందని, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగే కథ ఇదని అన్నారు. పోసాని, తా.రమేష్, కృష్ణ్భగవాన్‌ల పాత్రలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని, ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ నెలకొనడం ఆనందగా ఉందని, త్వరలోనే మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి జూలై రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే:దివాకర్‌బాబు, మాటలు:మల్లిక్, సంగీతం:శ్రీకాంత్, నిర్మాత:మాధవి అద్దంకి, దర్శకత్వం:శేఖర్‌బాబు.