వినాయక్‌తో నితిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘అఖిల్’ చిత్రాన్ని రూపొందించిన వినాయక్‌కు ఆ సినిమా భారీగా నిరాశపరచడంతో ఇప్పుడు వినాయక్ తనను తానూ ప్రూవ్ చేసుకునే పనిలో పడ్డాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం వినాయక్ నెక్ట్స్ సినిమా నితిన్‌తో చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు చిరంజీవి 150వ సినిమాను పూర్తిచేసిన తరువాత, వినాయక్ ఈ సినిమా చేయనున్నాడని తెలిసింది. ఇటీవల వినాయక్‌ను నితిన్, అతని తండ్రి కలిశారు. వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాను నితిన్ తండ్రి నిర్మించారు. ఆ వ్యవహారాలను నితిన్ దగ్గరుండి చూసుకున్నాడు. ఈ సినిమా దగ్గర నుంచి నితిన్ ఫ్యామిలీతో వినాయక్‌కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ‘అఖిల్’ సినిమా లాభాలను తీసుకురాకపోవడంతో, నితిన్ హీరోగా ఒక సినిమా చేస్తానని వినాయక్ మాటిచ్చినట్లు తెలిసింది. అందువలన ఈ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందే అవకాశం వుందని అంటున్నారు. అన్నట్టు ఆ అప్పట్లో వినాయక్ నితిన్‌ను ‘దిల్’ సినిమాతో మాస్ హీరోగా మార్చిన విషయం తెలిసిందే.