అట్టహాసంగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్‌లో అట్టహాసంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకడామీ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా బాలీవుడ్ సినిమా ‘నీర్జా’ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఒక్కో నగరంలో నిర్వహిస్తున్న ‘ఐఫా’ వేడుకలు ఈసారి న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో మూడురోజులుగా జరుగుతున్నాయి. కాగా ఆదివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. బాలీవుడ్‌లో సంచలనం రేపిన నీర్జా ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఏ దిల్ హై ముష్కి, ఎంఎస్‌ధోని ద అన్‌టోల్డ్ స్టోరీ, పింక్, సుల్తాన్, ఉడ్తాపంజాబ్ వంటి సినిమాలతో పోటీపడి ఈ అవార్డును కైవసం చేసుకుంది. కాగా ఉత్తమ దర్శకుడిగా అనిరుద్ధరాయ్ చౌదరి (పింక్), ఉత్తమ నటుడిగా షాహిద్ కపూర్ (ఉడ్తాపంజాబ్), ఉత్తమ నటిగా అలియాభట్ (ఉడ్తాపంజాబ్) అవార్డులు వరించాయి. ఉత్తమ రచయతలుగా షాకున్ బత్ర, అయేషా డిత్రెలు నిలిచారు. ఈనెల 13న న్యూయార్క్‌లో ప్రారంభమైన ఐఫా చిత్రోత్సవంలో శుక్రవారం నాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్‌మాన్ టైమ్‌స్వేర్ వద్ద నిర్వహించిన సంగీత కార్యక్రమం హైలెట్‌గా నిలిచింది. నిర్మాత కరణ్‌జోహర్, నటుడు సైఫ్‌అలీఖాన్ కార్యక్రమ నిర్వాహకులుగా సమర్ధంగా తమ పాత్ర పోషించారు. బాలీవుడ్ నటీనటులు సల్మాన్ ఖాన్,కత్రినాకైఫ్, షాహిద్‌కపూర్, అలియాభట్, సోనాక్షిసిన్హా, వరుణ్‌ధావన్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

ఉత్తమ నటి అలియాభట్