యువతకు నచ్చే రెండక్షరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కంచెమ్మతల్లి సినీప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా శ్రీనివాసరావు.ఎం దర్శకత్వంలో దేవదాస్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘రెండక్షరాలు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ పాటలు హైలెట్‌గా సాగే ఈ చిత్రం యువతకు బాగా నచ్చుతుందని, ఓ మంచి కథాకథనంతో రూపొందిన ఈ సినిమా సందేశాత్మకంగా ఉంటుందని, ఎంటర్‌టైన్‌మెంట్ జోడించామని తెలిపారు. ప్రేమికులు పెద్దల సహకారంతో పెళ్లిచేసుకుంటేనే అవి నిలబడతాయని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందనే అంశంతో ఈ చిత్రాన్ని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని ఆయన అన్నారు.
త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. కిరణ్, ఆచరణారెడ్డి, మణికంఠరెడ్డి, చిట్టిబాబు, సుమన్‌శెట్టి, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, గెటప్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సిద్దే సురేష్, సంగీతం: నంద, పాటలు: నందకిషోర్, కె.వెంకటేష్, కెమెరా: ఇ.సత్యహరిశ్చంద్రప్రసాద్, ఎడిటింగ్: నందమూరి హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరావు ఎం.