నా హృదయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావంత్, పావని జంటగా కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై ధనుంజయ్ దర్శకత్వంలో, పళ్లా రమణయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే..’ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ నేటి యువత తమ మనసులో ప్రేమ వుంటే, ఆ ప్రేమతోనే ప్రేమించిన వారిని దగ్గర చేసుకోవాలని, మనసుతో ప్రేమను చూస్తే దూరమైన మనుషులైనా దగ్గరవుతారని, ఆ ప్రేమను గెలిపించేందుకు కావలసిన మనుషులను తోడుగా ప్రేమే అందిస్తుంది అన్న విషయాన్ని అంతర్లీనంగా చెబుతూ, ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్నామని తెలిపారు. వైజాగ్, చీరాల తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తూ, గోవా, అరకులలో పాటల చిత్రీకరణ జరుపుతున్నామని, ఐదుగురు కుర్రాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఆయన తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాసరావు కిలారి, పాటలు: కాంచనపల్లి రాజేంద్రరాజు, ఎం.రామారావు, వి.ఎస్.ప్రభాకర్, సంగీతం: రాజ్‌కిరణ్, ఎడిటింగ్: హనుమంతు, కథ, కెమెరా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధనుంజయ.