పాటల రికార్డింగ్‌లో బేబీ డాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానస్, హాసికాదత్ జంటగా రైజింగ్ సన్ ఫిలింస్ పతాకంపై హాసికాదత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘బేబీ డాల్’. మున్నాకాశి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. గాయకుడు శ్రీరామచంద్ర ఆలపించిన పాటతో రికార్డింగ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరోయిన్, దర్శకురాలు హాసికాదత్ మాట్లాడుతూ, ఓ హీరోయిన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషమన్నారు. సరికొత్త కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని, అలాగే పాటలు కూడా ట్రెండీగా వుంటాయని అన్నారు. నిర్మాత రాజు మాట్లాడుతూ, హాసికాదత్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, తప్పకుండా చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందన్నారు. సంగీత దర్శకుడు మున్నాకాశి మాట్లాడుతూ, హాసికాదత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుందని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:శోభన్, ఆర్ట్:సురేష్, మాటలు:రవిశంకర్ పర్రి, నిర్మాత:రాజు, దర్శకత్వం:హాసికాదత్.