రుమేనియాలో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ చిత్రం టాకీ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం చిత్రంలోని రొమాంటిక్ సాంగ్‌ను మహేష్, రకుల్‌లపై చిత్రీకరించనున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటను వచ్చే నెల 2 నుంచి రుమేనియాలో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ సంచలనం రేపుతోంది. పలు ఏరియాలకు సంబంధించిన హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. లేటెస్ట్ టెక్నాలజీతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.