ఎన్టీఆర్ డాన్స్ అదుర్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 27 July 2017
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జై లవకుశ చిత్రం షూటింగ్ జోరుగా జరుగుతోంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను పూణెలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ పాటలో ఎన్టీఆర్ డాన్స్‌తో అదరగొట్టాడని దాన్ని చూసిన దర్శకుడు షాకయ్యాడట. ఈ విషయాన్ని బాబి సోషల్ మీడియాలో ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఎన్టీఆర్ నా కళ్లముందు డాన్స్ చేయడం నమ్మలేని అనుభవం. ఆయనకు పుట్టుకతోనే డాన్స్ లక్షణాలు ఉన్నాయి. ఆ డాన్స్‌ను ప్రత్యక్షంగా చూడడం నా అదృష్టమంటూ పొగిడేశాడు. మరి దర్శకుడినే అంతలా ఇంప్రెస్ చేసిన డాన్స్ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్లింగ్ ఇవ్వనుందో. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు.