రుద్రాక్షలో రమ్యకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ సినిమాలో శివగామిగా నటించి సంచలనం సృష్టించిన ప్రముఖ నటి రమ్యకృష్ణ ఇప్పుడు మరోసారి మరో క్రేజీ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ చిత్రం ఆమె భర్త దర్శకత్వంలో రూపొందడం విశేషం. క్రియేటివ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం ‘రుద్రాక్ష’. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీ రోల్ పోషించనున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోలు, హీరోయిన్లు నటిస్తున్నారని అంటున్నారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కే ఈ సినిమాలో సమంత ప్రధానపాత్ర పోషిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఇంతవరకూ ఎవరూ చూపని విధంగా ఉంటుందని సమాచారం.