ప్రభుదేవా హారర్ సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాన్సింగ్ సెనే్సషన్ ప్రభుదేవా హీరోగా కంటే కూడా దర్శకుడిగానే బాగా పాపులర్ అయ్యాడు. ‘ప్రేమికుడు’ సినిమాతో హీరోగా మారిన ప్రభుదేవా అటుపై పలు చిత్రాల్లో నటించినప్పటికీ కెరీర్ పరంగా సరైన క్రేజ్ రాలేదు. దాంతో దర్శకుడిగా మారి తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాన్ని రూపొందించాడు. తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించి, స్టార్ డైరెక్టర్‌గా సెటిలయ్యాడు. తాజాగా ఆయన నిర్మాణసంస్థను కూడా ప్రారంభించి, సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రభుదేవా స్టూడియోస్ బ్యానర్‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు కూడా. తాజాగా సొంత బ్యానర్‌లో ప్రభుదేవా హీరోగా నటించే సినిమా సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తుండడంతో ఆయన కూడా ఓ చిత్రంలో నటిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా మిల్క్భీమ తమన్నా హీరోయిన్‌గా నటించనుంది.