లజ్జ పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుమిత, శివ, వరుణ్ ప్రధాన పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహ సినిమా పతాకంపై బూచేపల్లి తిరుపతిరెడ్డి నిర్మిస్తున్న ‘లజ్జ’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, మధుమిత, వనమాలి, ఆర్.పి.పట్నాయక్ పాల్గొన్నారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఎప్పటినుండో ఓ సినిమా తీయాలనుందని, తొమ్మిది భాషల్లో ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తానని అన్నారు. ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయని, మంచి కానె్సప్ట్‌తో చేస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ నరసింహనంది మొదటి సినిమాతోనే దర్శకులందర్నీ తలెత్తుకునేలా చేశాడని, జాతీయ అవార్డును దక్కించుకున్నాడని, ఈ సినిమా కచ్చితంగా మంచి కమర్షియల్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం వుందన్నారు. దర్శకుడు నరసింహనంది మాట్లాడుతూ, ప్రతి అమ్మాయి పెళ్లయిన తర్వాత తన భర్త ప్రేమ తనకే సొంతం కావాలని కలలుగంటుందని, భర్త ప్రేమను దగ్గర్నుంచి పొందకపోయినా అతను ఆమెకు దగ్గరగా లేకపోయినా ఆ అమ్మాయి ఆలోచనలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందనేదే ఈ కథ అన్నారు. హీరోయిన్ మధుమిత అద్భుతంగా నటించిందని, అలాగే నిర్మాత సహకారం మరువలేనిదన్నారు. నిర్మాత మాట్లాడుతూ నరసింహనంది అద్భుతమైన కథ చెప్పాడని, తనను నమ్మి తీసిన సినిమా ఇదని, ఇకపై ఇలాంటి మంచి చిత్రాన్ని నిర్మించాలని వుంది అన్నారు.