రీమేక్ సినిమాలే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కని కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. ఆయన రూపొందించిన శుభాకాంక్షలు, ‘సుస్వాగతం’, ‘సూర్యవంశం’, ‘సుడిగాడు’ వంటి చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే వుంటాయి. స్ట్రెయిట్ చిత్రాలకంటే కూడా రీమేక్ సినిమాల దర్శకుడిగా ముద్రవేసుకున్నారాయన. ‘సుడిగాడు’ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘స్పీడున్నోడు’. బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక జంటగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 5న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతో ఇంటర్వ్యూ...

మళ్లీ రీమేక్ సినిమానే ఎంచుకోవడానికి కారణం?
- మొదటినుంచీ నేను చేసిన రీమేక్ సినిమాలకే ఎక్కువ పేరొచ్చింది. ముఖ్యంగా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్నది ‘సుందర పాండ్యన్’ సినిమా. సినిమా కంటెంట్ బాగా నచ్చడంతో ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన మూడేళ్లుగా వుంది. ‘సుస్వాగతం’, ‘శుభాకాంక్షలు’ తరువాత నేను బాగా మనసుపెట్టి చేసిన సినిమా ఇది.
నేటివిటీ కోసం మార్పులు చేశారా?
-తమిళంలో వారి నేటివిటీ ప్రకారం సహజంగా తీశారు. తెలుగులో కూడా అలాగే తీయొచ్చు కానీ, అది అందరికీ చేరదనే ఉద్దేశ్యంతో చాలా మార్పులు చేసి కామెడీ ఎమోషన్స్‌ను జోడించాము.
ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నారు కదా?
- ఈ కథ కోసం రవితేజ, సునీల్, మరో ఇద్దరు హీరోలను అనుకున్నాను. కానీ ఫైనల్‌గా బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఎంపిక చేశాం. కథకు కరెక్టుగా సరిపోయాడు. ఇలాంటి సినిమా చేయాలంటే ఇమేజ్ ఎక్కువగా ఉండకూడదు. అలాగే తను మొదటి సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోగా ఎదుగుతాడు.
రీమేక్ సినిమాను మార్పులు చేస్తే తేడా వస్తుంది కదా?
- ప్రతి సినిమాకు సోల్ వుంటుంది. దాంతోపాటు హార్ట్‌కూడా. తమిళంలో ఈ సినిమా చూసినపుడు బాగా టెంప్ట్ అయ్యాను. వెంటనే రైట్స్ తీసేసుకున్నాను. అలాగే తెలుగులో చేసేటప్పుడు సోల్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. నేను ఇదివరకు చేసిన చాలా సినిమాలు అలాగే జాగ్రత్తగా చేశాను.
అసలు కథేమిటి?
- ఇప్పటివరకు స్నేహం గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ భిన్నంగా నిలిచే సినిమా ఇది. ఇలాంటి పాయింట్‌ను ఎవరూ టచ్ చేయలేరు. ఫ్రెండ్స్ వున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఐదుగురు స్నేహితులు చదువులు పూర్తయ్యాక ఎవరి పనుల్లో వారు బిజీ అవుతారు. ఒక అమ్మాయివల్ల మళ్లీ ఐదు సంవత్సరాల తరువాత కలుస్తారు. ఆ సమయంలో వారికెదురైన సమస్యలు ఏమిటి అనేదే ఈ సినిమా. కథ మొత్తం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వుంటుంది.
ఆడియో రెస్పాన్స్ ఎలా వుంది?
- ఈ సినిమా రైట్స్ తీసుకుని మూడేళ్లు అయింది. అప్పుడు ‘సుడిగాడు’ సినిమాను చేస్తున్నాను. ఈ మూడేళ్లు ఈ సినిమా కోసం వర్క్ చేశాను. నా వెంట ప్రతి విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ వున్నాడు. తను ఇచ్చిన పాటలు అద్భుతంగా వున్నాయి. ఆడియో హిట్‌తో సినిమాపై మంచి నమ్మకం పెరిగింది.
నిర్మాతగా మారడానికి కారణం?
- నేను దర్శకుడవ్వాలని పరిశ్రమకు వచ్చాను. నా పాషన్ కూడా అదే. నిర్మాత అవ్వాలనే కోరిక నాకు లేదు. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంవల్ల నేనే ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఇది రీమేక్ సినిమా కావడం, స్టార్ హీరోలు లేకపోవడంతో ఈ సినిమా నిర్మాణానికి ఎవరూ పెద్దగా సహకరించలేదు. దాంతో ఆ రిస్క్ ఏదో నేను తీసుకోవాలని చేశా.
మీరు ఎక్కువగా రీమేక్ సినిమాలే చేయడానికి కారణం?
- రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారంటే, కచ్చితంగా నేను వాటికి అడిక్ట్ అయిపోయాను. రీమేక్ సినిమాలు బాగా చేస్తానని నా మీద ముద్రపడింది. మరో డైమెన్షన్‌ను ప్రూవ్ చేసుకునేవరకూ ఇవి చేస్తూనే వుండాలి. దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైంది కూడా రీమేక్ సినిమాతోనే. ఖచ్చితంగా మంచి స్ట్రెయిట్ సినిమా చేస్తా.
తమన్నాతో స్పెషల్ సాంగ్ చేయించారు?
- సినిమాలో ప్రత్యేకార్షణగా వుండాలని తమన్నాతో ఈ సాంగ్ చేయించాం. మిగతా పాటలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా చిత్రీకరించాం. ముఖ్యంగా తమన్నా పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఐటెం సాంగ్ అనగానే ఏదో రొమాన్స్ కోసమో చేసిన పాట కాదు. కొత్త కానె్సప్టుతో తెరకెక్కించాం.
అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా చేశారా?
అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. కానీ సినిమా బిజినెస్ విషయంలో చాలా హ్యాపీగా వున్నాం. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లతో నాకు మంచి ఫ్రెండ్‌షిప్ వుండడంవల్ల భారీగా బిజినెస్ జరిగింది.
హీరోయిన్ గురించి?
- సోనారిక చాలా మంచి నటనను కనపరిచింది. ఈ సినిమాతోపాటు మరో రెండు సినిమాల్లో చేస్తోంది. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వస్తుంది.
సుడిగాడు చిత్రానికి సీక్వెల్ చేస్తారా?
- లేదండి. ఆ ఆలోచన కూడా లేదు.
తదుపరి చిత్రాలు?
- నేను ఒక సినిమా చేస్తున్నపుడు మరో సినిమా గురించి ఆలోచించను. ఈ సినిమా పూర్తయింది. రిజల్ట్‌ను బట్టి మరో సినిమా ప్లాన్ చేస్తాను.
మరి పవన్‌కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు?
- ఆ విషయం నన్ను అడిగేకంటే పవన్‌ను అడిగితేనే మంచిది.

-శ్రీ