బాలీవుడ్‌లో పాగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకుని, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది అందాల భామ కాజల్. తెలుగులో పవన్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ మరోవైపు తమిళంలో కూడా రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈమె బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటిస్తోంది. ‘దోలఫ్జోంకీ కహాని’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ భామ ఘాటు లిప్‌లాక్ చేసింది. రణదీప్‌హుడా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ లిప్‌లాక్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు గ్లామర్‌ను సైతం భారీగానే ప్రదర్శిస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే కాజల్ ఇప్పుడు బాలీవుడ్‌లో పాగావేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. దక్షిణాదిలో మాత్రం గ్లామర్‌కు కండిషన్లు పెట్టే ఈ భామ ఇలా బాలీవుడ్‌లో రెచ్చిపోవడంతో సౌత్ దర్శక నిర్మాతలు షాకవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.