ఆస్కార్ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ తార ప్రియాంకచోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 29న అమెరికాలో జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాన వేదికపై ఆమె కన్పించనున్నారు. ఈ మేరకు ఆమెకు ఆస్కార్ కమిటీ ఆహ్వానం పంపింది. అమెరికాలో ప్రజాదరణ పొందిన టీవీ షో ‘క్వాంటికో’లో నటించి అందర్నీ ఆకట్టుకున్న ప్రియాంక ఇప్పుడు ఆస్కార్ ఆహ్వానంతో మరో ఘనత సాధించినట్లయింది. ఇక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో విజేతలకు ట్రోఫీలను అందించే అతిధుల్లో ఆమెకూడా ఒకరు. ప్రఖ్యాత హాలీవుడ్ తారలు జారెడ్ లెటో, కెర్రి వాషింగ్టన్, జులియన్ మూరె, క్విన్స్ జోన్స్‌తోపాటు ఆమె రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ చేసి అవార్డుల ప్రదానోత్సవంలో పాలుపంచుకుంటారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ప్రియాంకకు ఇప్పటికే అభినందనలు ముంచెత్తాయి. అమెరికాలో ఇటీవల జరిగిన స్క్రీన్ యాక్టర్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అందరిదృష్టినీ ఆకర్షించిన ప్రియాంకకు మరో చక్కటి అవకాశం లభించింది.