ఆకట్టుకునే ఫుల్‌మూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షకుమార్, డాలీ శర్మ జంటగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ పతాకంపై దీపక్ బల్‌దేవ్ దర్శకత్వంలో ప్రకాష్ ఠాకూర్ రూపొందించిన చిత్రం ‘్ఫల్‌మూన్’. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు దీపక్ బల్‌దేవ్ మాట్లాడుతూ, మంచి కథ, కథనంతో ఫుల్‌మూన్ అనే ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని, బాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్ అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. సంగీతం హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో సంగీత దర్శకుడు అభిలాష్ మంచి బాణీలను అందించారని, మూడు జంటల ప్రేమ కథ కథనాలతో రూపొందిన ఈ చిత్రం డెహ్రాడూన్‌లో పాటల చిత్రీకరణ జరుపుకుందని, సిమ్లా, కసోల్‌లో షూటింగ్ హైలెట్‌గా సాగిందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. నదీమ్ భార్గవ్, కామ్నాసింగ్, అభిలాష్, రుహానీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:అభిలాష్ గొలిడె, మాటలు:అశ్వినీ సింగ్, కెమెరా:ఖన్నా, దర్శకత్వం:దీపక్ బల్‌దేవ్.