మేకప్ లేకుండా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో గ్లామర్ భామగా మంచి అవకాశాన్ని అందుకున్న తాప్సికి కెరీర్‌పరంగా సరైన కమర్షియల్ బ్రేక్ రాలేదు. అవకాశాలు మాత్రం క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు గ్లామర్ భామగా అందాలను ఆరబోసిన ఈ భామ మొదటిసారి డీగ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందే ‘ఘాజి’ అనే చిత్రంలో నటిస్తోంది తాప్సి. సంకల్పరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. రాణా హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తాప్సి కూడా మరో ప్రధాన పాత్రలో కన్పిస్తుంది. నావికాదళ యుద్ధ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాలో తాప్సి డీగ్లామరైజ్డ్‌గా కన్పిస్తుండడం విశేషం. దీనికోసం ఈమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. పూర్తిగా మేకప్ లేకుండా ఇందులో ఆమె నటిస్తోంది. చాలాకాలం తరువాత ఇలాంటి పాత్రలో నటిస్తుండడంపట్ల సంతోషం వ్యక్తంచేసింది తాప్సి.